ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఫలితం వచ్చింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ ప్రధాని పీవీ నరశింహారావు కుమార్తె సురభి వాణి గెలుపొందారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి అయిన రామచందర్ రావుపై విజయం సాధించారు. నాలుగు రోజులుగా నిర్విర్యామంగా సాగుతున్న కౌటింగ్ ఈ రోజుతో ముగిసింది. ఈ స్థానంలో 93 మంది పోటీ చేశారు. 3,57,354 మంది పట్టభద్రులు […]