గ్రేటర్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రచార పర్వం ఊపందుకుంది. నేతల మాటలు మంటల్లా కాలిపోతున్నాయి. ఓ వైపు ప్రచారంలో ఆకట్టుకుంటూనే.. మరోవైపు అధికారంలోకి వస్తే తాము చేయబోయే పనులపై ఆయా పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. ఇందులో టీఆర్ఎస్ మేనిఫెస్టో పరిశీలిస్తే ఈసారి కూడా మంచినీళ్లు ప్రధానంగా మారాయి. 2016లో ఎన్నికలకు ముందే నీటి బకాయిలన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఎన్నికల్లో డిసెంబర్ నెల నుంచి 20 వేల లీటర్ల నీళ్ల వరకు బిల్లులు […]