ఐదు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి ఉప ఎన్నిక ఇదే కావడంతో.. అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే విజయం ఎవరిదన్నదానిపై ఎవరికీ సందేహాలు లేకపోవడమే ఈ ఉప ఎన్నిక విశేషం. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన మద్దతుతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసినా.. అదంతా రెండో స్థానం కోసమేనన్నట్లు సాగింది. విజయం తమదేనని […]
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమయ్యింది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు కూడా పాటిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు ప్రకటించారు. కౌంటింగ్ లోకి రావాలనుకుంటున్న అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను నెల్లూరు నగరంలోని డీకే డబ్ల్యూ కాలేజీలో లెక్కిస్తారు. చిత్తూరు జిల్లా […]
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపుపై అధికార వైసీపీ ఆది నుంచి ధీమాగా ఉంది. మెజారిటీపైనే ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. టీడీపీ, బీజేపీలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పోరాడాయి. అయితే తిరుపతి ఫలితం ఎలా ఉంటుందో టీడీపీ అనుకూల మీడియాకు ముందే తెలుసని తాజాగా జరిగిన ఓ ఘటన ద్వారా అర్థమవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఓ చర్చను చేపట్టింది. […]