నిన్న జరిగిన వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఇకపై ప్రేమ కథలు చేయనని ఇదే చివరిదని ప్రకటించడం అందరిని షాక్ కు గురి చేసింది. మీడియా సైతం ఇది ఊహించలేదు. ఇంకా పట్టుమని పది సినిమాలు కూడా కాలేదు. అప్పుడే లవ్ స్టోరీస్ అంటే ఇంత వైరాగ్యం ఎందుకొచ్చిందానే చర్చ జోరుగా సాగింది. వరల్డ్ ఫేమస్ లవర్ మీద నిజంగా గట్టి నమ్మకం ఉంటే ఈ మాట అనేవాడు కాదు. […]