పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలోనే అసంతృప్తి రేగుతోంది. దిగువ స్థాయి కార్యకర్తల పరిస్థితి ఎలా ఉన్నా.. సీనియర్లు, పొలిట్ బ్యూరో సభ్యులే తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉండే యనమల రామకృష్ణుడు నేరుగా పొలిట్ బ్యూరో సమావేశంలోనే ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచనను వ్యతిరేకించారు. ఎన్నికల్లో పోటీ చేయడం నైతిక బాధ్యత అని ఆయన చెప్పగా..ఇందులో నైతికత ఏముందని చంద్రబాబు కొట్టిపారేశారు. కాగా మరో సీనియర్ నేత, పోలిట్ బ్యూరో […]