పోలవరం ప్రాజెక్టు పనులు పరుగెత్తించి 72 శాతం పూర్తి చేశామని, తమ ప్రభుత్వం ఉంటే ఈపాటికి 100 శాతం పూర్తయ్యేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు విస్తుగొల్పుతున్నాయి. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో తాను అవినీతికి పాల్పడ్డట్టు ప్రచారం చేశారని.. నిరూపించారా? అని ప్రశ్నించారు. 72 శాతం పోలవరం పనులు పూర్తి చేశామంటున్న చంద్రబాబు అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత శాతం పూర్తి చేశారో చెబితే బాగుంటుందని అధికార పార్టీ […]