ఓటు వేయాలనే అత్యుత్సాహం ఓ ప్రజా పతినిధికి తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఓటు ఉండి వేస్తే ఫర్వాలేదు.. కానీ దొంగ ఓటు వేసిన సదరు ప్రజా ప్రతినిధి ఇప్పుడు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భర్తతో కలసి ఓటు వేశారు. చూపుడు వేలు చూపిస్తూ ఓటు వేసినట్లు మీడియాకు ఫోజులిచ్చారు. ఇక్కడే ఆమె దొరికిపోయారు. డిగ్రీ అర్హత లేని తాటికొండ స్వప్న […]