పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో నీతి బాహ్యమైన, చట్టవిరుద్ధమైన దోపిడీ చర్యలకు సంబంధించిన అనేక విషయాలను మీ ముందుకు తీసుకురావటానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. ఏ ఒక్కరూ ఏ విధంగానూ బలపరచలేదు. నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతాఖానీ షాపు మాత్రమే. జనాన్ని కదిలిస్తే తప్ప ప్రజలు తమంత తాముగా నిలబడటం నేర్చుకుంటేనే తప్ప మరో మార్గం లేదు’. 1969లో మార్చి 16న తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీలో తరిమెల […]