నిద్ర లేచింది మొదలు ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అంటూ ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు .. తెలంగాణలో తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసినప్పటికీ నోరు మెదపడం లేదు. తన పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లినా కనీసం స్పందించకపోవడం విడ్డురంగా ఉంది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు, సత్తుపల్లి నుంచి […]