ఇంట్లో పిల్లాపాపలతో నిశ్చింతగా జీవితం గడుపుతూ నిద్రపోతాం కానీ దానికి కారణమైన దేశ సరిహద్దుల్లోని సైనికుల అనంతమైన త్యాగం కారణమని గుర్తుకువచ్చే సందర్భాలు తక్కువ. వెండితెరపై కూడా వాటిని చూపించిన దాఖలాలు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అలాంటి వాటిలో ముందు వరసలో అగ్ర సింహాసనం దక్కించుకునే సినిమా బోర్డర్. 1971 ఇండియా పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో జరిగిన భీకర యుద్ధం ఆధారంగా దర్శకుడు జెపి దత్తా 1995లో స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టారు. ఇది ఆయన డ్రీం ప్రాజెక్ట్. […]