iDreamPost
android-app
ios-app

రాహుల్ పై మామ పొగడ్తల వర్షం.. నా అల్లుడు బంగారం!

  • Published Nov 14, 2023 | 12:49 PM Updated Updated Nov 14, 2023 | 12:49 PM

టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా తరఫున బ్యాటింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న కేఎల్ రాహుల్ పై మామ సునీల్ శెట్టి పొగడ్తల వర్షం కురిపించారు.

టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా తరఫున బ్యాటింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న కేఎల్ రాహుల్ పై మామ సునీల్ శెట్టి పొగడ్తల వర్షం కురిపించారు.

  • Published Nov 14, 2023 | 12:49 PMUpdated Nov 14, 2023 | 12:49 PM
రాహుల్ పై మామ పొగడ్తల వర్షం.. నా అల్లుడు బంగారం!

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన 9 మాచ్యుల్లో 9 విజయాలు నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో తిరుగులేని టీమ్ గా జైత్రయాత్ర కొనసాగించింది. ఈ విజయాల్లో అందరి సమష్టి కృషి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాలు కూడా ఎంతో చక్కగా రాణించాయి. బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ అందరి మన్ననలు పొందుతున్నాడు. గాయాలు, ఫామ్ లేమితో గతేడాది ఎంతో ఇబ్బంది పడిన రాహుల్ ఈ వరల్డ్ కప్ లో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 347 పరుగులు చేశాడు. వాటిలో ఒక శతకం, ఒక అర్ధ శతకం కూడా ఉన్నాయి. అల్లుడు ప్రదర్శనపై మామ సునీల్ శెట్టి పొగడ్తలు కురిపించారు. నా అల్లుడు బంగారం అంటూ కొనియాడారు.

టీమిండియా ప్రదర్శనలో కెేఎల్ రాహుల్ కూడా కీలక పాత్ర పోషించాడు అనే చెప్పాలి. ముఖ్యంగా లీగ్ దశలో జరిగిన ఆఖరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై రాహుల్ చెలరేగాడు. కేవలం 62 బంతుల్లో శతకం నమోదు చేశాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనపై అభిమానులు, మాజీలు మాత్రమే కాదు.. పిల్లను ఇచ్చిన మామ కూడా ఆనందం వ్యక్తం చేశారు. భార్య అతియా శెట్టి, మామ సునీల్ శెట్టి కూడా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మామ సునీల్ శెట్టి కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. “నేను స్వతహాగా కేఎల్ రాహుల్ అభిమానిని. నాకు అల్లుడు కాకపోయినా కూడా నేను రాహుల్ అభిమానినే అయి ఉంటాను. అతనికి క్రమశిక్షణ, నిబద్ధత, శక్తి, నిలకడ మాత్రమే కాకుండా ఏదో సాధించాలనే గొప్ప తపన అతనిలో ఉంది. ఏదైనా ఇచ్చేందుకు రాహుల్ కు మంచి మనసు ఉంటుంది. మీలో ఇచ్చే కళ ఉంటే.. మీలో జీవించే కళను నేర్పుతుంది. నేను అతియాకి ఎప్పుడూ ఒకటే విషయాన్ని చెప్పే వాడిని. రాహుల్ ని భర్తగా పొందడం నీ అదృష్టం అంటాను. రాహుల్ క్రికెట్ అయినప్పటి నుంచి నేను కేఎల్ రాహుల్ అభిమానినే. అతను కొడుకుగా ఉన్నప్పుడు అభిమానినే.. నా అల్లుడు అయ్యాక అభిమానినే. అతను ఇంకా సాధించాల్సిందే ఎంతో ఉంది. నా అల్లుడు బంగారం” అంటూ సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు.

రాహుల్- అతియా శెట్టి విషయానికి వస్తే.. వీళ్లు కొన్నేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. టీమిండియా కూడా ఈ వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. బుధవారం భారత్ కు అసలు సిసలు మ్యాచ్ ఉంది. న్యూజిలాండ్ తో టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం అత్యవసరం. అలాగే న్యూజిలాండ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ, లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడించిన ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకెళ్తోంది. మరి.. కేఎల్ రాహుల్ పై సునీల్ శెట్టి పొగడ్తలు కురిపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetcell girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom