మాయాబజార్. ఈ పేరులోనే ఒక మేజిక్ ఉంది. దశాబ్దాలు దాటినా, తెలుగు సినిమా ఎన్ని కొత్త పుంతలు తొక్కినా స్క్రీన్ ప్లే గ్రామర్ కు తిరుగు లేని ఉదాహరణగా ఇప్పటి తరం ఫిలిం మేకర్స్ సైతం గర్వంగా చెప్పుకునే పేరిది. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఛానల్ మార్చకుండా అలా చూస్తుండి పోయేలా చేయడం దర్శకులు కెవి రెడ్డి ఇంద్రజాలమే. దిగ్గజాలైన నటులున్నప్పటికీ కేవలం పాత్రలు మాత్రమే కనిపించేలా చేయడం ఆయనకే చెల్లింది. అయితే ఇంతలా చరిత్రలో సువర్ణాధ్యాయం […]
1983 సంవత్సరం. ‘మంచుపల్లకి’తో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వంశీకి ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది కానీ కమర్షియల్ గా మరీ గొప్ప స్థాయికి వెళ్లలేకపోయింది. సున్నితమైన కథాంశాన్ని నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయితో చేసిన స్నేహం గురించి తీసిన తీరు విమర్శకులను మెప్పించింది. అప్పుడే తను అసిస్టెంట్ గా ఎన్నో చిత్రాలకు పని చేసిన పూర్ణోదయా సంస్థ నుంచి వంశీకి ఆఫర్ వచ్చింది. మంచి కథను సిద్ధం చేసుకోమని చెప్పారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. అప్పటికే […]
ఒకే హీరోతో ఇంకో స్టార్ పోటీపడటం సహజమే కానీ తనతో తనే క్లాష్ అయ్యే సందర్భాలు అరుదుగా వస్తుంటాయి. బాలకృష్ణ-నానిలు ఈ ఫీట్ సాధించడం మనకు గుర్తే కానీ ఒక్క రోజు గ్యాప్ లో సుమన్ కూ ఈ ఘనత దక్కింది. అదేంటో చూద్దాం. 1990 సంక్రాంతికి సుమన్ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఎవరూ వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో సెల్ఫ్ కాంపిటీషన్ తప్పలేదు. ఆ టైంకి తనకు మంచి మార్కెట్ నడుస్తోంది. […]
ప్రతి ఒక్కరికి అమ్మానాన్న అన్నా చెల్లి అక్కా తమ్ముడు భార్య భర్తకు మించిన బంధాలు ఉండకపోవచ్చు. కానీ వాటితో ముడిపడిన లేదా వాళ్ళతో బంధుత్వం కలిగిన కొందరు మన జీవితంతో ఎంతగా ముడివేసుకుంటారో ఊహించడం కష్టం. వీళ్ళ మధ్య ఏర్పడే ఎమోషన్ తో కుటుంబ ప్రేక్షకులను అలరించేలా గొప్ప కథలను రాసుకుని సినిమాలుగా చూపిస్తే ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. దానికి మంచి ఉదాహరణ బావ బావమరిది. దాని విశేషాలు చూద్దాం. 1992లో తమిళంలో ప్రభు ఖుష్బూ జంటగా […]
గతమెప్పుడూ తీయని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందులోనూ సినిమాకు సంబంధించినది అయితే ఇక దాని గురించి చెప్పేదేముంది. ఇక్కడ మీరు చూస్తున్న పిక్ అలాంటిదే. ఇందులో ముగ్గురు హీరోలు ఒక దర్శకులు(తర్వాత ఆయనా హీరో అయ్యారు లెండి) ఉన్నారు. కాకపోతే ఒకే మూవీ కోసం కలుసుకున్న సందర్భం అయితే కాదు. అనుకోకుండా జరిగిందిది. 1994లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాషా’, ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తీస్తున్న ‘టాప్ […]
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 80,90 దశకంలోకి తొంగి చూస్తే సుమన్, రాజశేఖర్ లు ఇద్దరూ స్టార్లకు ధీటుగా యాక్షన్ హీరోలుగా మంచి మార్కెట్ కలిగినవాళ్ళే . విలన్ గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో కనిపించి ఆపై అంకుశంతో తిరుగులేని బ్రేక్ తో పాటు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పేరు తెచ్చుకోవడం రాజశేఖర్ కే చెల్లింది. ఉద్రేకంతో కూడిన ఎమోషన్స్ ని మొహంలోనే చూపించడంలో ఇతను చూపించిన నేర్పు ఎందరో […]