iDreamPost
android-app
ios-app

Suman: విద్యావ్యవస్థలో జగన్ చొరవ ఎవరూ తీసుకోలేదు: సుమన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఏపీ విద్యావ్యవస్థపై, సీఎం జగన్ పై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఏపీ విద్యావ్యవస్థపై, సీఎం జగన్ పై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

Suman: విద్యావ్యవస్థలో జగన్ చొరవ ఎవరూ తీసుకోలేదు: సుమన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం,  ఏ నాయకుడు తీసుకోని చొరవ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నాడు. నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా సర్కార్ బడులను తయారు చేశారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి.. వారి చదువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు. ఇక ఏపీ విద్యావ్యవస్థపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా సినీ నటుడు సుమన్..సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.

సినీ నటుడు సుమన్ ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలపై  ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ అద్భుతమని కొనియాడారు. పట్టణాల్లో పాఠశాలకు ధీటుగా పల్లెటూరు స్కూల్స్ ను తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. అలానే ఒక్కప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు టాయిలెట్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడేవారని, నాడునేడు స్కీమ్ ద్వారా పూర్తి మార్చేశారని ఆయన తెలిపారు.

అలానే  విద్యావ్యవస్థలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చూపిన చొరవ గతంలోనూ ఏ  నాయకుడు చూపలేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఇటీవల రాజమండ్రి ప్రాంతంలోని పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించానని తెలిపారు. వాటిని చూసి.. తాను ఆశ్చర్యానికి గురైనట్లు ఆయన తెలిపారు. విద్యావ్యవస్థ విషయంలో  సీఎం జగన్ మోహన్ రెడ్డి చూపిన చొరవ చాలా గొప్పదని ఆయన తెలిపారు. అలానే మీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దని, వారికే సపోర్టుచేయాలని సుమన్ తెలిపారు. ఏపీలో పర్యటించిన ఆయన ఓ పాఠశాలను సందర్శించారు.

అక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడి…పలు విషయాలు తెలుసుకున్నారు. అలానే గతంలోనూ ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ఏపీలోని తన సొంత జిల్లా బాపట్లలో పర్యటించారు. ఆ సందర్భంలో తన సొంత ఊరిలోని ప్రభుత్వ పాఠశాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతకాలం హైదరాబాద్ లో ఉండి.. ఏపీలో స్కూల్స్ పై వస్తున్న వార్తలు అబ్దమని భావించాని..తాను స్వయంగా చూశాక..చాలా ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు. విద్యారంగంలో సీఎం జగన్ తీసుకున్న చొరవ అద్భుతమంటూ కోనా వెంకట్ ప్రశంసించారు. తాజాగా సుమన్ సైతం ఏపీ విద్యావ్యవస్థను ప్రశంసించారు. మరి.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సుమన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.