దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన సామాన్య ప్రజలతోపాటు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా బారిన పడే ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా వారందరూ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకిందని నిర్థారణ అయింది. ఆయనతోపాటు […]