తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థితి కల్పించే లక్ష్యంతో ప్రతి పథకాన్ని రూపొందించామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవతర్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్రెడ్డి అధ్యక్షతన […]
ఈ నెల 25వ తేదీన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పేరుతో ప్రారంభమైన ఇళ్ల పట్టాల పంపిణీ, గృహనిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం కొనసాగుతోంది. మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. దీనికి కొనసాగింపుగా ఈ రోజు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఉదయం తాడేపల్లి నుంచి శ్రీకాళహస్తి వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. కొద్దిసేపటి క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందుకూరులో […]
కరోనా వైరస్ రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో పొరుగు రాష్ట్రం తమిళనాడు సాహస నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తో తమకున్న సరిహద్దులను మూసివేసింది. రహదారులపై గోడలు నిర్మించింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాతో తమకు ఉన్న మూడు సరిహద్దు రహదారులపై గోడలు నిర్మించింది. వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చిత్తూరు జిల్లా బోర్డర్ లోని మూడు ప్రాంతాలలో రోడ్లపై అడ్డంగా గోడ నిర్మించారు. ఈ విషయంపై చిత్తూరు జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]