ఆయన ఒత్తిడితోనే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. సమయం వస్తే ఆయన్ను ఆమదాలవలస నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడ్తాను.. స్పీకర్ లాంటి రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న తమ్మినేని సీతారాంను ఉద్దేశించి మాజీ ప్రభుత్వ విప్, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ చేసిన దారుణ వ్యాఖ్యాలివి. ఇటువంటి వ్యాఖ్యలతో నమోదైన కేసులోనే పోలీసులకు లొంగిపోయి.. బెయిల్ పొందిన ఆయన.. కోర్టు బయటే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తన నోటి దురుసును, తలబిరుసు తనాన్ని మరోమారు […]
మాజీమంత్రి, టీడీపీ విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆమదాలవలస పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. గురువారం మధ్యాహ్నం ఆయన విశాఖ నుంచి నేరుగా ఆమదాలవలస వెళ్లి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో భేటీ అయ్యారు. స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఇరువురు కూర్చొని చర్చించుకున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేశారు. తన రాజీనామా అంశాన్ని గంటా ప్రస్తావించారని.. పరిశీలిస్తానని చెప్పానని వివరించారు. రాజీనామాపైనే చర్చ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం […]