కొవిడ్ మహమ్మారితో మరో ప్రముఖుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సోరాబ్జీ(91) శుక్రవారం ఉదయం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1930లో ముంబయిలో జన్మించిన సోరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. 1971లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్ అడ్వొకేట్‌గా గుర్తించింది. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సోరాబ్జీ మానవ హక్కులపై విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో […]