ఉదయాన్నే లేచి హడావిడిగా ఆఫీస్కు వెళ్ళడం.. అక్కడ చెప్పిన పని చేయడం.. లోటు పాట్లుంటే బాస్తో తలంటించుకోవడం.. ఇప్పటి వరకు ఉద్యోగ జీవితానికి అలవాటైపోయిన కార్యక్రమం. అయితే కరోనా పుణ్యమాని వర్క్ఫ్రంహోంకు బీజం పడింది. అందరిన్నీ కలిపి ఒకే చోట ఉంచితే వ్యాధి వ్యాపించే భయం ఉడడంతో ఇళ్ళ వద్దనే ఉండి పనిచేయాల్సిందిగా ఆయా సంస్థలే సూచించాయి. దీంతో ఉద్యోగులు ఇళ్ళ నుంచి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా కార్యాలయానికి వెళ్ళకపోయినా పనిచేయగలిగే ఉద్యోగాలు ఈ విధంగా […]