Krishna Kowshik
హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీ బస్టాఫ్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి.
హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీ బస్టాఫ్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి.
Krishna Kowshik
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జర్నలిస్టు కాలనీ బస్టాఫ్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. నాల్గవ అంతస్తులో తొలుత పొగలు వచ్చి.. ఆ వెంటనే మంటలు అలముకున్నాయి. మంటలు రావడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు.. వెంటనే బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నఅగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది.
ఈ అగ్ని ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జరిగింది. అప్రమత్తమైన ఉద్యోగులు.. వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలుస్తుంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో మంటలు అలముకున్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్దంగా పార్కింగ్ ఏరియాను భవనం ఓనర్.. స్టోర్ రూంగా వాడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిన దానిపై దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.