తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడికి ఎస్ఐ చేయించిన శిరోముండనం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అమానుష ఘటనలో నిందితులైన ఎస్ఐ, ఇద్దరుకానిస్టేబుళ్లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకున్నా కూడా మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ వ్యవహారంపై సరికొత్త అనుమానులు వ్యక్తం చేస్తూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. సస్పెండ్ లాంటి సదాసీదా చర్యలతో సరిపెట్టకుండా జగన్ సర్కార్ ఈ ఘటనకు బాధ్యులైన […]