దేశ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రజలు కరోనాతో అల్లాడుతున్నా ఇవేవీ పట్టని నేతలు రాజకీయ విమర్శలకు దిగుతూ అధికార పీఠం కోసం పావులు కదుపుతున్నారు. కరోనా వైరస్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌స్పాట్ కేంద్రంగా మారుతున్న ముంబై మహానగరం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరు పెట్టేలా ఉంది. సిద్ధాంత వైరుధ్యం గల శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలు జట్టు కట్టడం ఏమాత్రం జీర్ణించుకులేకపోతున్న ప్రతిపక్ష బిజెపి..సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే […]
మహారాష్ట్ర గవర్నర్ తనను ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నియమించాలనే క్యాబినెట్ తీర్మానంపై నిర్ణయాన్ని ప్రకటించకుండా సీఎం ఉద్ధవ్ థాకరేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.అసలే దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తమ రాష్ట్రంలోనే నమోదు అవుతుండటంతో ఆందోళన చెందుతున్న ఉద్ధవ్‌కు తాజా రాజకీయ పరిణామాలు మింగుడు పడట్లేదు. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఆ రాష్ట్ర శాసనమండలిలో సభ్యుడిగా నియమించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి తీర్మానించింది.ప్రస్తుతం మహారాష్ట్ర శాసన మండలి నందు గవర్నరు […]
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేని ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర కేబినెట్ గవర్నర్‌ను కోరింది. ఈ రోజు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కోరింది. నేటి కేబినెట్ భేటీకి అధ్యక్షత వహించకుండా ముఖ్యమంత్రి ఉద్ధవ్ దూరంగా ఉన్నారు. అనేక నాటకీయ పరిణామాల […]
బీజేపీతో దశాబ్దాల కాలం పాటు ఆప్త మిత్రులుగా కొనసాగిన శివసేన ఇప్పటికే బిజెపితో విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలని జేడీయూ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. తాజాగా ఎన్ఆర్సీ ఆందోళనలు దానికి మరింత ఆజ్యంపోశాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యన్నార్సీ ని ఎట్టి పరిస్థుల్లోనూ తమ రాష్ట్రం లో అనుమతించబోమని బహిరంగంగానే […]
పుణె మున్సిపల్ కార్పొరేషన్లో అధికారంలో ఉన్న శివసేన.. ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ నుంచి వేరే జాతీయ బ్యాంక్‌కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే యాక్సిస్‌లో సీనియర్ అధికారిణిగా ఉన్న మాజీ సీఎం ఫడ్నవిస్ సతీమణి అమృత.. శివసేన నిర్ణయంపై ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో పోస్ట్‌లు పెడుతున్నారు. తాను దేవేంద్ర ఫడ్నవీస్‌ను పెళ్లి చేసుకోక ముందు […]