కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన షిరిడీలో కొలువైన సాయిబాబా ఆలయాన్ని మూసివేయనున్నారనే వదంతులతో భక్తుల్లో ఆందోళన మొదలయింది. వివరాల్లోకి వెళితే సాయిబాబా జన్మస్థలం మహారాష్ట్ర పర్బనీ జిల్లాలో ఉన్న పథ్రి గ్రామమని భక్తుల నమ్మకం. కోట్లాది మంది భక్తులు సాయి జన్మ స్థలాన్ని కూడా దర్శిస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సాయిబాబా జనమ స్థలమైన పథ్రి గ్రామ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించడంతో వివాదం రాజుకుంది. […]