సంక్రాంతి అనగానే బలవంతపు ఫ్యామిలీ సినిమా తియ్యాలనే ఆలోచన ఎంత ప్రమాదకరమో “ఎంత మంచివాడవురా” చెబుతుంది. పండగ రోజు ఫ్యామిలీలందరూ జాతరకి వచ్చినట్టు సినిమా హాళ్లకు వస్తారనేది వాస్తవమే. కానీ వాళ్లకి బంధాలు, బంధువులు, స్నేహాలు, సాయాలు అంటూ టీవీ సీరియల్ మెటీరియల్ని వడ్డించాలనుకోవడం పొరపాటు. సెన్సిబిల్ సినిమాలకన్నా రెడిక్యులస్ కామెడీకే ఫ్యామిలీ ప్రేక్షకులు పట్టం కడతారనేది పోయినేడు సంక్రాంతికి వచ్చిన “ఎఫ్-2” రుజువు చేసింది. ఆ టైములో వచ్చిన “ఎన్.టి.ఆర్ కథానాయకుడు”, “వినయ విధేయ రామ” […]