కొనుగోలుదారులకు కన్నీళ్ళు తెప్పిస్తున్న ఉల్లి దెబ్బ నుంచి ప్రజలను కాపాడేందుకు ఏపీ సర్కార్ నడుంబిగించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ. 60 నుంచి రూ. 90ల మధ్య తచ్చాడుతోంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కేజీ రూ. 40లకే అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు అధికారులతో చేసిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు. […]