ఏపీలో కీలకమైన నగరాల్లో విశాఖదే ప్రథమ స్థానం. ఇప్పుడు మరో కీలక స్థాయికి ఈ నగరం చేరుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉన్న బీచ్‌లలో విశాఖకు చెందిన రుషికొండ బీచ్ స్థానం దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా 8 బీచ్‌లకు ఈ గుర్తింపు లభించగా, అందులో ఒకటి రుషికొండ. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యావరణ హితంగా ఉండడం, పరిశుభ్రత, రసాయన రహితంగా ఉండడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) […]