రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీపై ఉన్నంత అభిమానం చంద్రబాబు నాయుడుకి కూడా ఉండకపోవచ్చు.రాధా కృష్ణకు జగన్ మీద ఉన్నంత ద్వేషం ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా ఉండకపోవచ్చు . ఈ విషయం ఇప్పటికి అనేక సందర్భాల్లో ఋజువయ్యింది. ఈ రోజు మరోసారి ఋజువయింది. రాష్ట్రం, యావత్ భారత దేశం ఆ మాటకొస్తే యావత్ ప్రపంచం, యావత్ మానవ జాతి కరోనా వ్యాధితో విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ప్రపంచ దేశాలు ఈ విపత్తును ఎదురుకునేందుకు అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. […]
అమరావతి ఉద్యమంలో 49 రోజులనుండి రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న నేపధ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజదాని ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే లు ఆర్కే, ఉండవల్లి శ్రీదేవి లు కూడా ముఖ్యమంత్రి ని కలవడానికి వచ్చిన బృందంలో ఉన్నారు. ఇటీవలే నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు మందడంలో దీక్ష చేస్తున్న రైతులను కలసి […]
ఆకాశమే హద్దుగా భూముల ధరలు పెరగడంతో ఆడపిల్లల పెళ్లిళ్ల సందర్భంగా కట్నం కింద రెండు కోట్లు ఇస్తామన్న వాళ్లు.. ఆ మేరకు ధర పలుకుతున్నందున ఎకరం భూమి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ధరలు పడిపోవడంతో మీ భూమి వద్దు.. ఇస్తామన్న రెండు కోట్లు ఇవ్వండి అని కొందరు అల్లుళ్ల నుంచి ఒత్తిడి వస్తోందని ఆడపిల్లల కుటుంబీకులు వాపోతున్నారు. (ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో) – ఆర్కే కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే. అలా ఆడపిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని […]
తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి ఏ విధంగా అండగా నిలుస్తుందనే విషయం గురించి ప్రతీ సారి ఉపోద్ఘాతం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెదేపా అనుకూల మీడియాలోనూ వారికి ఆత్మబంధువు లాంటిది ‘ఆంధ్రజ్యోతి’; వారి ఆక్రోశానికి, అసహనానికి, ఉడుకుబోతుతనానికి ఆర్కే ‘కొత్త పలుకు’ ప్రతిబింబమనీ అదే పనిగా చెప్పక్కర్లేదు. కనుక విషయంలోకి వచ్చేద్దాం … “తన సామాజికవర్గంపై ఇతర కులస్థులలో వ్యతిరేకత ఏర్పడేలా ఒక పథకం ప్రకారం ప్రత్యర్ధులు ప్రచారం చేసినా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో చంద్రబాబు అలక్ష్యం ప్రదర్శించారు.” […]
ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చే ‘కొత్త పలుకు’ చదివిన వారెవరికైనా చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీలోని వ్యక్తుల కన్నా వేమూరి రాధాకృష్ణ (ఆర్కే)గారికే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనిపించకమానదు. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని, రాజకీయ నాయకుల్ని ఆర్కే తన ఏబీఎన్ ఛానెల్లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అంటూ ఒక కార్యక్రమం చేస్తుంటారు. ఆ కార్యక్రమానికి సినిమా రంగం నుంచి సీనియర్లు ఎవరు వచ్చినా కూడా ఎలాగోలా ఎన్టీ రామారావు ప్రస్తావన తీసుకునిరావడం, ఆయన్ని […]