ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. ఒకవైపు కరోనా ప్రకంపనలు తగ్గకుండానే వేర్వేరు కారణాల వల్ల జరుగుతున్న వరస మరణాలు బాలీవుడ్ ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే షూటింగులు లేక, థియేటర్లు మూతబడి కకావికలం అయిన పరిశ్రమను ఈ పరిణామాలు కృంగదీస్తున్నాయి. నిన్న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ 34 ఏళ్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడం మీడియాతో పాటు సినిమా ప్రేమికులను కుదిపేసింది. ఆన్ లైన్ లో ఎక్కడ చూసినా ఈ ఘటన తాలూకు వార్తలు, […]
“రిషికపూర్ చనిపోయాడు”-మా ఆవిడ చెబితే “సరిగా చూశావా” అని రెట్టించి అడిగాను. నమ్మడం కష్టంగా ఉంది. నిన్న ఇర్ఫాన్, ఈ రోజు రిషి. ఇర్ఫాన్ గొప్ప నటుడు, బాధ కలిగింది. కానీ రిషి గొప్ప నటుడు కాదు. దుక్కం వచ్చింది. ఎందుకంటే నా బాల్యమే ఆయన సినిమాలు. పసితనం గుర్తుకొస్తే దుక్కం తప్పదు. నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు “బాబీ” వచ్చింది. ఎలా వచ్చింది, ఒక ఉప్పెనలా వచ్చింది. ఎక్కడ చూసినా అవే పాటలు. బాబీ బెల్ట్, […]
ఇండియన్ సినిమాకు కరోనా రూపంలోనే కాకుండా మరో విధంగానూ 2020 మర్చిపోలేని పీడకలగా మారుతోంది. నిన్న విలక్షణ నటులు ఇర్ఫాన్ ఖాన్ మృతిని ఇంకా జీర్ణించుకోకముందే మరో దిగ్గజం రిషికపూర్ కాలం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ఇవాళ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో కన్నుమూశారు . ఎంతో అనుభవమున్న సీనియర్ నటుడిగా స్టార్ డం చవిచూసిన రిషి కపూర్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. 1970లో నాన్న […]