సూపర్ వైజర్ వేధింపులు భరించలేక మహిళా రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఇద్దరు వైస్ ఛాన్సలర్ తో కూడిన కమిటీని వేశారు. నబీలా ఖానమ్ అనే యువతి ఎఎమ్ యూకు చెందిన జవహర్ లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో ఇంటర్ డిసిప్లినరీ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో పరిశోధనలు చేస్తోంది. […]