రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. తాను తీసుకున్న సొమ్ము రికవరీ చేసేందుకు అవసరమైన పిటిషన్ ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో ఎస్బిఐ దాఖలు చేసింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకి ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులు ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీని వెంటాడుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) బాకీల రికవరీకి రంగంలోకి దిగింది. ఆయకిచ్చిన రూ.1,200 […]