iDreamPost

కొత్త వ్యాపారంలోకి అంబానీ డాటర్.. దూకుడు పెంచిన రిలయన్స్ గ్రూప్

  • Published May 16, 2024 | 1:05 PMUpdated May 16, 2024 | 1:05 PM

దేశంలో దిగ్గజ వ్యాపార సంస్థల్లో రిలయన్స్‌ గ్రూప్‌ కూడా ఒకటి. అయితే ఈ రిలయన్స్‌ గ్రూప్‌, అంబానీ డాటర్‌ తాజాగా ఓ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇంతకి అదేమిటంటే..

దేశంలో దిగ్గజ వ్యాపార సంస్థల్లో రిలయన్స్‌ గ్రూప్‌ కూడా ఒకటి. అయితే ఈ రిలయన్స్‌ గ్రూప్‌, అంబానీ డాటర్‌ తాజాగా ఓ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇంతకి అదేమిటంటే..

  • Published May 16, 2024 | 1:05 PMUpdated May 16, 2024 | 1:05 PM
కొత్త వ్యాపారంలోకి అంబానీ డాటర్.. దూకుడు పెంచిన రిలయన్స్ గ్రూప్

భారత దేశంలో దిగ్గజ వ్యాపార సంస్థల్లో రిలయన్స్‌ గ్రూప్‌ కూడా ఒకటి. కాగా, ఈ వ్యాపార సామ్రాజ్యం అనేది అంబానీ నేతృత్వంలో..గత కొన్నేళ్లుగా వివిధ కొత్త కంపెనీల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే, అంబానీ వ్యాపార సంస్థల్లో వారసులు కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వారిలో అంబానీ కూతురు ఇషా అంబానీ అంబానీ చేతిలో రిలయన్స్‌ వ్యాపారం పడిన తర్వాత.. ఊహించని ఇషా తన వ్యాపార వేటను కొనసాగిస్తుంది. అంతేకాకుండా.. వ్యాపారంలో పుంజుకుంటూ.. అంబానీకి కాసులు వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్‌ గ్రూప్‌ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. ఇంతకి రిలయన్స​్‌ గ్రూప్‌ అడుగు పెట్టబోతున్న ఆ కొత్త వ్యాపారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా రిలయన్స్‌ గ్రూప్‌ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే.. రిలయాన్స్‌  రిటైల్ వెంచర్స్ 150 బిలియన్ డాలర్ల డయాగ్నస్టిక్ హెల్త్ కేర్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం  వెల్లడైంది.  ఇక ఈ రంగంలో రూ.1,000 నుంచి రూ.3,000 కోట్లను పెట్టుబడిగా పెట్టి.. ఈ వ్యాపారంలో ఉన్న ఏదైనా కంపెనీని కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రయత్నిస్తుంది. కాగా, కొత్త కంపెనీ ఏర్పాటు చేయటం కంటే.. డెడికేటెడ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సంస్థలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం ఉత్తమమని కంపెనీ భావిస్తోంది.

ఇక అందుకోసం ముఖేష్‌ అంబానీకి చెందిన సంస్థ ప్రస్తుతం దేశవ్యాప‍్తంగా తమ ఉనికిని కలిగివున్న ప్లేయర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రిలయన్స్‌ గ్రూప్‌ ఆన్‌లైన్‌ ఫార్మసీ నెట్‌మెడ్స్‌ను కలిగి ఉండటంతో పాటు.. థైరోకేర్‌, హెల్తీయన్స్‌ వంటి ఇతర సంస్థలతో టై అప్‌ ల ద్వారా పాథాలజీ సేవలను అందిస్తుంది. ఇకపోతే నెట్‌మెడ్స్‌ ఇప్పటికే ఇతర సంస్థల సహకారంతో పాథాలజీ సేవలను అందజేస్తుండగా.. ఇప్పుడు రిలయన్స్‌ రిటైల్ వెంచర్స్ భారతదేశం అంతటా ఫిజికల్ లాబొరేటరీల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి, అలాగే విస్తృత శ్రేణి రోగనిర్ధారణ సేవలను అందించడానికి, స్కేలబిలిటీని పెంచడానికి సొంతంగా డయాగ్నస్టిక్ కంపెనీని స్థాపించాలని ఆలోచనలో ఉంది. దీనికి ముందు 2020లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను రూ.620 కోట్లకు కొనుగోలు చేసింది.

కాగా, రేటింగ్ ఏజెన్సీ CRISIL ఏప్రిల్‌లో విడుదలచేసిన నివేదిక ప్రకారం.. డయాగ్నోస్టిక్ కంపెనీలు 2025 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 10-11 శాతం వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అంచనా వేసింది. అందుకు ప్రధానంగా టైక్-2,3 నగరాల్లో సమగ్ర నివారణ ఆరోగ్య ప్యాకేజీల కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంమని కంపెనీ పేర్కొంది. ఇక దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యంపై ప్రజలు మళ్లీ దృష్టి సారించడమే నివారణ ఆరోగ్య పరీక్షల పెరుగుదలకు కారణమని కొంతమంది నిపుణులు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. మరి, రిలయన్స్‌ గ్రూప్‌, అంబానీ డాటర్‌ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి