చిత్తూరు జిల్లా చేప పులుసు, నాన్ వెజ్ తినాలంటే తిరుపతి భేరివీధిలోని రెడ్డెమ్మ మెస్కు వెళితే చాలు. లోపలికి అడుగు పెడితే ఒక పెద్దావిడ ప్రేమగా పలకరించి ఏం కావాలో అడిగి మరీ వడ్డిస్తుంది. వండడం , వడ్డించడం అంతా ఆమె కుటుంబ సభ్యులే చేస్తారు. నేను తిరుపతిలో దాదాపు 20 ఏళ్లు ఉన్నాను. ఈ మెస్లో ఎన్నోసార్లు తిన్నాను. ఎప్పుడూ ఒకటే రుచి. రెడ్డెమ్మ అదే పలకరింపు. సౌమ్యంగా ఉండే రెడ్డెమ్మలో ఒకోసారి తిరుపతి గంగమ్మ […]