అసెంబ్లీలో మిగతా సభ్యులు మాట్లాడేది ఒకెత్తు, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడేది ఒకెత్తు అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పరిపాటిగా మారగా, ప్రభుత్వానికి మద్దతుగా నిలవడము రాపాకకు అలవాటుగా మారింది. ఇక శాసన మండలి రద్దు విషయంలో కూడా ఆయన అదే మార్గాన్ని అనుసరించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును సైతం వదల్లేదు. ఆయన దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ […]
ప్రభుత్వం తీసుకునే మంచినిర్ణయాలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని గతంలోనే చెప్పిన రాపాక వరప్రసాద్ నేడు అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచారు. దీనికి ఓ కారణం ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని రాపాక వరప్రసాద్ ను ఈరోజు ఉదయం బహిరంగ లేఖలో కోరారు. కానీ తన పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా రాపాక వరప్రసాద్ మూడు రాజధానులకు జై […]
తుగ్లక్ మరణించిన రోజు ఆయన దర్బార్లోని ఒక మహా కవి ‘పోనీ లెండి ..ప్రజలను చూడాల్సిన బాధ్యత నుంచి రాజుకు….ఈయన పిచ్చి చర్యలను భరించాల్సిన ఖర్మ నుంచి ప్రజలకు ఇన్నాళ్లకు విముక్తి కలిగింది” అన్నాడట. అది అక్షరాల నిజమే ..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ,బీజేపీల మధ్య కుదిరిన ఒప్పందం విషయంలో కార్యకర్తలు, ప్రజలూ అలాగే అంటున్నారు. ”పొనిలేండి ..పార్టీని నడపాల్సిన బాధ్యత నుంచి పవన్ కు విముక్తి కలిగింది. .ఆయన పిచ్చి చేష్టలను భరించాల్సిన అగత్యం నుంచి […]
మొదటినుండి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అప్పుడప్పుడూ షాకులిస్తూనే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అనేక సందర్భాల్లో పవన్ అభీష్టానికి వ్యతిరేకంగా రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు చేయడం అప్పుడప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటన మరోసారి జరిగింది. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులోపవన్ కళ్యాణ్ తలపెట్టిన విస్తృత సమావేశానికి హాజరు కాకుండా గుడివాడలో ఎడ్ల పందేలను తిలకించడానికి రాపాక వరప్రసాద్ […]