భావోద్వేగాలను సరిగ్గా చూపించాలే కానీ తల్లి సెంటిమెంట్ తో మాస్ క్లాస్ ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకోవచ్చు. ఈ సూత్రాన్ని సరిగ్గా పాటించడం వల్లే మాతృదేవోభవ, అమ్మ రాజీనామా లాంటి సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. వీటిలో స్టార్లు ఉండరు. కేవలం ఆర్టిస్టులు ఉంటారు. అయినా కూడా బ్రహ్మరథం దక్కింది. అలాంటి మరో చక్కని చిత్రం ఊయల. ఆ విశేషాలు చూద్దాం. 1997లో మలయాళంలో జయరాం మంజు వారియర్ జంటగా ఇరట్టకుట్టికలుదే అచన్ సినిమా వచ్చింది. మంచి హిట్ […]
1992లో చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ ఇండస్ట్రీ హిట్ దెబ్బకు ఘరానా పదం మాస్ కు త్వరగా రీచ్ అయిపోయే తారక మంత్రంగా మారింది. అంతటి సూపర్ స్టార్ కృష్ణ సైతం ‘ఘరానా అల్లుడు’ అనే సినిమా చేశారు. నాగార్జునకు ఆ టైంలో మాస్ మార్కెట్ బాగా పెరుగుతోంది. ‘శివ’ మేనియాలో చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టడంతో కమర్షియల్ ఫార్ములాని నమ్ముకుని యువసామ్రాట్ చేసిన అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, […]
అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్స్ తో యూత్ హాట్ ఫేవరెట్ గా మారిన విజయ్ దేవరకొండకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకోవడంతో అభిమానులు కూడా సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళ కళ్లన్నీ పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న భారీ సినిమా మీదే ఉన్నాయి. ఇప్పటికే అరవై […]
స్టార్ హీరోలకు ఒక ఇమేజ్ అంటూ ఏర్పడ్డాక దానికి భిన్నంగా ఏదైనా ప్రయోగం చేసినప్పుడు అందులో రిస్క్ ఉంటుంది. అది సక్సెస్ అయ్యిందా ఓకే లేదా ఏ మాత్రం తేడా కొట్టినా దాని బాక్స్ ఆఫీస్ ఫలితం చాలా తేడాగా ఉంటుంది. చిరంజీవి లాంటి అగ్ర హీరో ఇలాగే రుద్రవీణ, ఆపద్బాంధవుడు, ఆరాధన లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు చేసినప్పుడు తిరస్కారం తప్పలేదు. కారణం అభిమానుల అంచనాలు పూర్తిగా తప్పడమే. అయితే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా […]
లాక్ డౌన్ రూపంలో కరోనా తెచ్చిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. సినిమా టీవీ అనే భేదం లేకుండా మొత్తం స్థంబించిపోయాయి. సీరియల్స్ షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో రేటింగ్స్ తో పాటు యాడ్స్ తగ్గిపోయి ఛానల్స్ లబోదిబోమంటున్నాయి. వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ప్రేక్షకులకు ఒకరకమైన విసుగు తెప్పించారనే చెప్పాలి. ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మీద అవగాహన లేని కామన్ ఆడియెన్స్ వాటినే చూస్తూ రిపీట్ రన్స్ కు […]
ఏదైనా సినిమా చూస్తున్నంతసేపు చక్కిలిగింతలు పెడుతూ నవ్విస్తున్నట్టు అనిపించిందంటే అందులో నిఖార్సైన కామెడీ ఉన్నట్టు. స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా చిక్కులుంటాయి. అభిమానులను సంతృప్తి పరచటం అందులో ప్రధానమైనది. అలాంటిది వాళ్ళతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనుకోవడం కత్తి మీద సామే. దర్శక దిగ్గజం, రచయిత జంధ్యాల గారు మెగాస్టార్ చిరంజీవి తో ఓ కామెడీ నవల ఆధారంగా చంటబ్బాయి తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారు కాని ఆ రోజుల్లో […]
ప్రస్తుతం కరోనా బ్రేక్ డౌన్ వల్ల పరిశ్రమ మొత్తం ఇళ్లకే పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. ఎప్పటికి నార్మల్ అవుతుందో అర్థం కావడం లేదు కానీ స్టార్లు ఒకపక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క దినసరి వేతనం మీద ఆధారపడే కార్మికులు మాత్రం విరాళాల సహాయంతో రోజులు నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మహమ్మారి ప్రభావం వల్ల పెళ్లితో పాటు రంగ్ దే కీలకమైన షెడ్యూల్ ని వాయిదా వేసుకున్న హీరో నితిన్ ఆ వెంటనే […]
ప్రస్తుతం అన్ని భాషల్లోనూ రాజ్యమేలుతున్న బయోపిక్ ల ట్రెండ్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత మీద తీస్తున్న తలైవి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఎంఎక్స్ ప్లేయర్ సంస్థ క్వీన్ పేరుతో రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో ఒక వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసింది . అన్ని వాస్తవాలు చూపించారా లేదా అనేది పక్కన పెడితే టేకింగ్ పరంగానూ ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ పరంగానూ దీనికి ఫీడ్ బ్యాక్ బాగా వచ్చింది. అందులోనూ రెగ్యులర్ […]
https://youtu.be/
https://youtu.be/