iDreamPost
android-app
ios-app

నీలాంబరి పాత్ర నేను చేయాల్సింది! ఆమె వల్లే మిస్ అయ్యింది: మీనా

  • Published Mar 20, 2024 | 6:51 PM Updated Updated Mar 20, 2024 | 6:51 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో నరసింహ ఒకటి. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలో రజినీకాంత్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ముందుగా ఓ స్టార్ హీరోయిన్ అనుకున్నరట. కానీ, ఆ హీరోయిన్ కు రమ్యకృష్ణ వళ్లే ఆ అవకాశం పోయిందని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో నరసింహ ఒకటి. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలో రజినీకాంత్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ముందుగా ఓ స్టార్ హీరోయిన్ అనుకున్నరట. కానీ, ఆ హీరోయిన్ కు రమ్యకృష్ణ వళ్లే ఆ అవకాశం పోయిందని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

  • Published Mar 20, 2024 | 6:51 PMUpdated Mar 20, 2024 | 6:51 PM
నీలాంబరి పాత్ర నేను చేయాల్సింది! ఆమె వల్లే మిస్ అయ్యింది: మీనా

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పలసిన అవసరం లేదు. తలైవా నటించిన సినిమా ఏదైనా వేరే లెవల్ లో ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడతారు. అంతలా ఆయన తన అద్భుతమైన నటనతో, స్టైలిస్ట్ లుక్స్ తో అభిమానులను కట్టిపడేస్తుంటారు. అయితే రజినీకాంత్ ఇప్పటి వరకు నటించిన బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో నరసింహ ఒకటి.  కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటిలో ఇండస్ట్రీలోని ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా, ఈ సినిమాను మొదటగా తమిళ్ లో పడయప్పాను అనే పేరుతో 1999లో తెరకెక్కించారు. ఆ తర్వాత తెలుగులో నరసింహా అనే పేరుతో డబ్ చేశారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన పాత్ర ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. అంతలా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించారు. కానీ, రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్రలో ముందుగా ఓ స్టార్ హీరోయిన్ అనుకున్నరటా. అయితే ఆ హీరోయిన్ కు రమ్యకృష్ణ వళ్లే ఆ అవకాశం పోయిందని తాజాగా ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకి ఆమె ఎవరంటే..

రజనీకాంత్, హీరోయిన్ సౌందర్య కాంబీనేషనలో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా తెరకెక్కిన సినిమా నరసింహ. ఈ సినిమాలో శివాజీ గణేశన్ కీలక పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ నెగిటివ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. అసలు ఈ సినిమాలో రమ్యకృష్ణ నీలంబరి పాత్రలో నటించారు అనే మాటకన్నా జీవించారనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో ఆ పాత్రకు మొదటగా ఓ స్టార్ హీరోయిన్ తీసుకోవాలని అనుకున్నరట. కానీ, ఆ హీరోయిన్ కు రమ్యకృష్ణ వాళ్లే ఆ అవకాశం పోయిందని కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఇంతకి నటి మరెవరో కాదు, ఒకప్పుడు తన అందచందాలతో.. క్యూట్ గా అలరించిన హీరోయిన్ మీనా. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టిన మీనా.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగుతో పాటు తమిళ్ లో పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

Meena

అయితే, తాజాగా మీనా తాను కొన్ని సినిమాలు డేట్స్ అడ్జట్ కాక చేయాలేక పోయానని చెప్పారు. అందులో నాగర్జున నటించిన నిన్నపెళ్లాడతా సినిమా ఒకటి ఉంది. ఇక రజనీకాంత్ గారు నటించిన నరసింహా సినిమాలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి రోల్ కూడా నేను మిస్ చేసుకున్నా అని తెలిపారు. ఎందుకంటే.. అప్పుడు నేను హోమ్లీ పాత్రలు చేస్తున్నాను. పైగా రజినీకాంత్ గారితో చాలా సినిమాలు చేశాను. మా ఇద్దరిది మంచి పెయిర్. కానీ, నెగిటివ్ రోల్ కావడంతో మా అమ్మ నన్ను ఆ సినిమా చెయవద్దని చెప్పారు. అయితే నాకు ఆ పాత్ర బాగా నచ్చింది. అంతలోనే ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బాగా చేస్తారని ఆమెకు ఆపర్ చేయడం,  ఆ తర్వాత నాకు సౌందర్య పాత్ర ఆఫర్ చేయడం జరిగింది. కానీ, నేను చేస్తే రమ్యకృష్ణ పాత్రే చేస్తా అని చెప్పను. దీంతో అలా ఆ సినిమా మిస్ చెసుకున్నా అంటూ మీనా చెప్పుకొచ్చారు. మరి, హీరోయిన్ మీనా చేసిన ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş