రాజ్యసభలో ఖాళీ అయిన 55 స్థానాల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 37 స్థానాలు ఏకగ్రీవం కాగా 18 స్థానాల్లో పోటీ అనివార్యమైంది. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. 37 స్థానాల్లో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలు కావడంతో అవన్నీ ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ తదితరులు […]