తెలుగుదేశం వెనకడుగు వేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నింటా అడ్డంకులు కల్పించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు తొలిసారిగా ముందడుగు వేయలేక మౌనంగా ఉండిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆశ్చర్యకర అంశమే. పైగా తాము పోటీలో ఉంటామని ప్రకటించిన తర్వాత కూడా టీడీపీ తయారు కాలేకపోవడం విశేషమే. ఏపీలో ఖాళీ అయిన ఒక్క మండలి సీటుకి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే టీడీపీ సై అని ప్రకటించింది. తాము కూడా అభ్యర్థిని రంగంలో దింపుతామని చెప్పింది. […]
రాజకీయాలను చదరంగంతో పోలుస్తారు. చదరంగంలో ఆటగాడు ఒక ఎత్తు వేసే ముందు ఆ ఎత్తుకి సమాధానంగా ప్రత్యర్థి ఎయే ఎత్తులు వేయవచ్చో, వాటికి సమాధానంగా తను ఏ ఎత్తులు వేయవచ్చో ముందుగానే ఆలోచించి ఎత్తు వేసినట్టే రాజకీయ నాయకుడు కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు తన ప్రత్యర్థులు దానికి ఎలా స్పందిస్తారో, దానికి తన ప్రతిస్పందన ఎలా ఉండాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. రాజకీయాన్ని చదరంగంలా ఆచితూచి ఆడే నాయకులలో దేశంలోనే ముందు వరుసలో ఉంటాడు […]
నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుండి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించడం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి తగిన బలం లేకపోయినా వర్ల రామయ్యని టీడీపీ తరపునబరిలోకి దించి పోలింగ్ జరిగేలా చంద్రబాబు చేశారు. అందరూ అనుకున్నట్టుగానే వైసీపీ అభ్యర్థులు నలుగురూ గెలవగా టీడీపీ ఊహించిన విధంగా అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లే కాక మరొక ఓటు తగ్గింది . టీడీపీ ఎమ్మెల్యే అదిరెడ్డి భవానీ పొరపాటు ఫలితంగా వర్ల […]
గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు నాటకీయ పరిణామాల మధ్య వెల్లడైయ్యాయి. మధ్య మధ్యలో ఓట్ల లెక్కింపుకు అంతరాయం కలిగి నిలిచిపోయి ఫలితాలు ఎట్టకేలకు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో మూడు స్థానాలను బిజెపి, ఒక స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. గుజరాత్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నాలుగింటిలో మూడింటిని గెలుచుకోవాలని బిజెపి ఎప్పటి నుండో వ్యూహాలు రచించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోనేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్ని చేసింది. రాజ్యసభ ఎన్నికల […]
రాజస్థాన్లో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా ఊహించిన విధంగానే వచ్చాయి. ఇవాళ జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బిజెపికి ఒకస్థానం దక్కింది. రాజస్థాన్లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలలో ప్రతిపక్ష బిజెపి రెండిటిలో విజయం కోసం ఢిల్లీ పెద్దల అండదండలతో వ్యూహాలు రచించిన ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీ వేణు గోపాల్, నీరజ్ డాంగి విజయం సాధించగా బిజెపి […]
దేశ వ్యాప్తంగా ఈ రోజు 18 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయా స్థానాల్లో ముందుగా ఊహించిన విధంగానే అభ్యర్థులు విజయం సాధించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరంలలో 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్థానాలు వైసీపీ గెలుచుకోగా, మధ్యప్రదేశ్లో రెండు బీజేపీ, ఒక స్థానం కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ యువ నేత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీ నుంచి రాజ్యసభకు […]
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో నాలుగు ఓట్లు చెల్లని విషయం తెలిసిందే. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు ఏసీబీ అరెస్ట్ కారణంగా, మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కరోనా పాజిటివ్ వ్యక్తిని కలవడంతో స్వతహాగా పోలింగ్కు దూరంగా ఉన్నారు. మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు చెల్లినవిగా కౌంటింగ్ అధికారులు తేల్చారు. నాలుగు ఓట్లు చెల్లలేదు. […]
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే అతను. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెండు చోట్లా పోటీ చేశారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తుఫానులో అక్కడ, ఇక్కడా కూడా పవన్ కల్యాణ్ ఓటమిని చవి చూశారు. పార్టీ అధినేత కూడా గెలవలేని పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వర ప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా […]
ఊహించిన ఫలితమే వచ్చింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులూ ఘన విజయం సాధించారు. ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు సాధించారు. మార్చినెలలో జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. చివరకు ఈరోజు జరిగిన పోలింగ్ లో 173 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కి దూరమయ్యారు. పోలయిన ఓట్లలో నాలుగు ఓట్లు చెల్లలేదు. ఆ నాలుగూ టీడీపీకే చెందినవి కావడం విశేషం. పైగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ల మీద టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ […]
రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ అసెంబ్లీకి చెందిన 175 మంది ఎమ్మెల్యేలకు గానూ 173 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. జనసేన తరుపున గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా తన ఓటు వినియోగించుకున్నారు. ఆయన కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు జై కొట్టారు. టీడీపీ తరుపున గెలిచిన 23 మందిలో 21 మంది ఓటు వేశారు. ఇద్దరు సభ్యులు ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. వారిలో అచ్చెన్నాయుడు […]