Idream media
Idream media
మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓ ఆసక్తికరైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతి ఓటు విలువైనది కావడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఎమ్మెల్యేలందరూ సభకు హాజరకావల్సి ఉంటుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సభకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు.
క్వారంటైన్‌లో ఉన్న ఆయన పూర్తి పిపిఈ కిట్‌ను ధరించి, ఫుల్ ప్రొటక్షన్‌తో సభలోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాజిటివ్ ఉన్న ఎమ్మెల్యే రావడంతో.. అందరిలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా అయ్యారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని సామాన్యులకు దూరంగా, నిర్జన ప్రదేశాల్లో పూర్తి రక్షణాత్మకంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆయన నుంచి మరొకరికి వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతో ఈ విధమైన ఏర్పాట్లు చేస్తారు. క్వారంటైన్‌లో ఉండే వారిని కలవడం అంత తేలిక కాదు. అలాంటి వ్యక్తి సభకు రావడంతో నెట్టింట పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.