IPL2022లో ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. లక్నో మంచి ఫామ్ లో ఉండటంతో RCB పై ఎక్కువ అంచనాలు లేవు. మొదట బ్యాటింగ్ చేసిన RCBలో కోహ్లీ, మ్యాక్స్ వెల్, డుప్లిసిస్ ఇలా అందరూ త్వరగానే అవుట్ అయిపోవడంతో ఈ సారి కూడా RCB వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రజిత్ పాటిదార్ గ్రౌండ్ లో విధ్వంసం సృష్టించాడు. వరుస సిక్స్, […]