తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సౌమ్యులుగా పేరున్న నటుడు కృష్ణ, గాయకుడు బాలసుబ్రమణ్యం మధ్య విభేదాలతో చాలా రోజులు కృష్ణ గారి సినిమాలకు బాలుగారు పాడలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. బాలుగారు గాయకుడిగా నిలదొక్కుకుంటున్న తొలిరోజుల్లో బాగా సపోర్టు చేసిన కృష్ణ గారితో మనస్పర్ధలు రావడమంటే మరీ ఆశ్చర్యం అనిపిస్తుంది. బాలు మద్రాసులో నేపధ్య గాయకుడిగా ప్రవేశించిన తొలిరోజుల్లో గాయకుడు రామకృష్ణ బాగా పాపులర్ గాయకుడిగా ఉండేవాడు. అగ్రనటులు రామారావు, నాగేశ్వరరావు రామకృష్ణతోనే పాడించుకునే వాళ్ళు. అది చూసి శోభన్ […]
అదేదో సినిమాలో ఎల్బి శ్రీరామ్ రాసిన డైలాగ్ ఒకటుంది. అదృష్టలక్ష్మి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ నొక్కితే సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చాడంట ఒకడు. బ్యాడ్ లుక్ వెంటే ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇలాంటివి మరీనూ. దానికో చక్కని ఉదాహరణ ఉంది. 1992లో రామ్ గోపాల్ వర్మ పేరు దేశమంతా మారుమ్రోగిపోతున్న టైంలో అతనితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలని అగ్ర నిర్మాత అశ్వినిదత్ ప్లాన్ చేసుకున్నారు. ఏదైనా మంచి కథ […]
కొన్ని సినిమా విచిత్రాలు చూడడానికి వినడానికి భలే వింతగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఏదైనా సబ్జెక్ట్ ఒక భాషలో హిట్ అయ్యిందంటే మరో భాషలో డబ్బింగ్ లేదా రీమేక్ చేయడం సర్వసాధారణంగా జరిగేదే. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ అదే కథను సినిమాలగా తీస్తూ పోతే దాన్నేమంటారు. అలాంటి వింతలు పరిశ్రమలో బోలెడున్నాయి. మచ్చుకు ఒకటి చూద్దాం 32 ఏళ్ళ క్రితం అంటే 1988లో కృష్ణంరాజు, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో ప్రాణ స్నేహితులు అనే సినిమా […]
ఇక్కడి ఫోటోలో ముగ్గురు స్టార్లను గుర్తు పట్టారు కదా. నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, వెంకటేష్ కలిసి ఒకే స్టేజిని పంచుకున్నారు. వెనకేమో 100 అనే నెంబర్ హై లైట్ అవుతోంది. ఏ వేడుక అనే ప్రశ్న తలెత్తుతోంది కదూ. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ప్రసిద్ధ నిర్మాత ఎంఎస్ రాజు 1991లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి మొదటి ప్రయత్నంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో శత్రువు నిర్మించారు. సినిమా సూపర్ డూపర్ […]