iDreamPost
android-app
ios-app

ముగ్గురు తారల స్వీట్ ‘100’ మెమరీ – Nostalgia

  • Published Feb 04, 2020 | 10:15 AM Updated Updated Feb 04, 2020 | 10:15 AM
  • Published Feb 04, 2020 | 10:15 AMUpdated Feb 04, 2020 | 10:15 AM
ముగ్గురు తారల స్వీట్  ‘100’  మెమరీ – Nostalgia

ఇక్కడి ఫోటోలో ముగ్గురు స్టార్లను గుర్తు పట్టారు కదా. నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, వెంకటేష్ కలిసి ఒకే స్టేజిని పంచుకున్నారు. వెనకేమో 100 అనే నెంబర్ హై లైట్ అవుతోంది. ఏ వేడుక అనే ప్రశ్న తలెత్తుతోంది కదూ. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ప్రసిద్ధ నిర్మాత ఎంఎస్ రాజు 1991లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి మొదటి ప్రయత్నంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో శత్రువు నిర్మించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

రివెంజ్ డ్రామా అయినప్పటికీ మంచి సస్పెన్స్ ఎలిమెంట్ తో క్రైమ్ ని చూపించిన తీరుకి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. ముఖ్యంగా “థాంక్స్” అంటూ కోట శ్రీనివాసరావు చేసిన విలనీ జనానికి విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. రాజ్ కోటి సంగీతం, దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి సంభాషణలు, బలమైన స్టార్ క్యాస్టింగ్ వెరసి ఏకధాటిగా వంద రోజులు ఆడేసింది. బొబ్బిలి రాజా తర్వాత మరో కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కి శత్రువు తన మాస్ ఇమేజ్ ని బలపరిచింది అందుకే వంద రోజుల సంబరాలను ఎంఎస్ రాజు గ్రాండ్ గా నిర్వహించారు.

దానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ వచ్చినప్పుడు ఆ సందర్భంగా తీసిన ఫోటోనే ఇది. బాలయ్య విజయశాంతిల జోడి అప్పటికే ఎన్నో సూపర్ హిట్స్ లో నటించింది. ఆవిడ వెంకీతో జట్టు కట్టింది శత్రువుతోనే. ఆ తర్వాత ఈ ఇద్దరూ సూర్య ఐపిఎస్ లో కూడా నటించారు కానీ అది ఆశించిన విజయం సాధించలేదు. కొంత గ్యాప్ తర్వాత తమిళ్ రీమేక్ చినరాయుడులో నటించారు. అదీ పర్వాలేదు అనిపించుకుంది కానీ శత్రువు స్థాయిలో ఆడలేదు. మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వలేదు. ఇప్పటికీ వెంకటేష్ అభిమానులు శత్రువు సినిమాని చాలా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారు. పెర్ఫార్మన్స్ పరంగానూ వెంకీకి ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన శత్రువు బాక్స్ ఆఫీస్ సక్సెస్ కు మాత్రం మిత్రుడయ్యింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom