చైనా తదితర దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. చైనా దేశంలో ఎంబీబీఎస్ చదివిన ఓ వైద్యవిద్యార్థి తిరిగి భారతదేశానికి రాగా అతనికి కరోనా వైరస్ లక్షణాలున్నాయని, దీంతో అతన్ని జైపూర్ నగరంలోని ఎస్ఎంఎస్ వైద్యకళాశాలలోని ఐసోలేషన్ వార్డుకు తరలించామని రాజస్థాన్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ చెప్పారు. కరోనా వైరస్ అనుమానిత రోగితోపాటు అతని కుటుంబసభ్యుల రక్త శాంపిళ్లను సేకరించి పరీక్షించేందుకు పూణే నగరంలోని జాతీయ వైరాలజీ లాబోరేటరీకి పంపించామని […]