తూర్పు కనుమలలో గోదావరికి ఇరువైపులా ఛామనఛాయ రూపం కొంచెం పొడవు, కొనతేలిన ముక్కు, చిరు గడ్డం, ముడివేసిన పొడవైన జుట్టు, చిన్న గోచి #అడ్డ పంచె లతో కనిపించే పురుషులు, మెడకు రకరకాల పూసల పేర్లు, నాసికారంధ్రాల మధ్య నత్తులను ధరించిన మహిళలు, “కొండరెడ్డి” తెగకు చెందిన గిరిజనులు. కొండరెడ్లు ఎక్కువగా ఖమ్మం , తూర్పుగోదావరి జిల్లాలోని అడవులపై కొండలపై నివాసం ఉంటారు. తూర్పు గోదావరి జిల్లాలోని(రాష్ట్ర విభజనకు ముందు ఖమ్మం జిల్లాలో) గబ్బిలాల గొంది, తోట […]