శిఖరమంత మెగాస్టార్ అనే ఇమేజ్ చిరంజీవికి ఒక్క సినిమాకో ఒక్క ఏడాదిలోనో రాలేదు. దాని వెనుక సంవత్సరాల కష్టం ఉంది. ఎన్నో జయాలు అపజయాలు చూస్తూ ఎగుడుదిగుడుల ప్రయాణం చేశాకే ఎవరెస్ట్ శిఖరం లాంటి సింహాసనం దక్కింది. ఎంత పెద్ద స్టార్ అయినా తెరమీద విడుదలైన మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. సరిగ్గా ఇదే రోజు 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి అనే నటుడి చిత్రం మొదటిసారి సిల్వర్ స్క్రీన్ ను పలకరించింది. అదే ప్రాణం ఖరీదు. […]