ఆయనో రాజకీయ కురువృద్ధుడు.. జీవితంలో అధికభాగం రాజకీయాల్లోనే గడిపారు. ఓటమి ఎరుగని ధీరుడిగా, పంజాబ్ రాజకీయాల్లో మేరు నగధీరుడిగా పేరుపొందారు. అకాలీదళ్ కు తిరుగులేని నేతగా, పదిసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు దఫాల్లో రెండు దశాబ్దాల పాటు సీఎంగా రాష్ట్రాన్ని శాసించిన యోధుడు చివరికి సామాన్యుడి చీపురు ధాటికి తల వంచారు. జీవితంలో తొలిసారి ఓటమి రుచి చూశారు. 95 ఏళ్ల ముదిమి వయసులో.. 11వ సారి ఎమ్మెల్యే అవుదామన్న ఆయన ఆశలు ఆప్ గాలిలో కొట్టుకుపోయాయి. ఆయన […]