చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మైనర్‌గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొని, మేజర్‌గా అయిన తర్వాత ఆమె ఆ లైంగిక వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే సంబంధిత నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. ఆమె మేజర్ అన్న కారణంతో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను న్యాయస్థానాలు తిరస్కరించడానికి వీల్లేదంది. కాలేజీలో చేరిన […]