భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో హిమాలయాల్లోని నిషేధిత ప్రాంతానికి చేరుకున్న ఓ మహిళ ఆ ప్రాంతం విడిచి వెళ్లనని, నేను పార్వతిని.. శివుడినే పెళ్లి చేసుకుంటాను, కైలాస పర్వతంపై ఉన్న శివుడ్ని చేసుకుంటాను అంటూ అందర్నీ హడలెత్తిస్తోంది. ఉత్తర్ప్రదేశ్లోని అలీగంజ్ ప్రాంతానికి చెందిన హర్మిందర్ కౌర్ అనే మహిళ తన తల్లితో కలిసి ఇటీవల కైలాస పర్వతానికి వెళ్లే దారిలో ఉన్న పుణ్యక్షేత్రమైన గంజ్ కు వెళ్లింది. 15రోజులపాటు ఆ ప్రదేశంలో ఉండటానికి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. […]