iDreamPost
iDreamPost
భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో హిమాలయాల్లోని నిషేధిత ప్రాంతానికి చేరుకున్న ఓ మహిళ ఆ ప్రాంతం విడిచి వెళ్లనని, నేను పార్వతిని.. శివుడినే పెళ్లి చేసుకుంటాను, కైలాస పర్వతంపై ఉన్న శివుడ్ని చేసుకుంటాను అంటూ అందర్నీ హడలెత్తిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగంజ్ ప్రాంతానికి చెందిన హర్‌మిందర్ కౌర్ అనే మహిళ తన తల్లితో కలిసి ఇటీవల కైలాస పర్వతానికి వెళ్లే దారిలో ఉన్న పుణ్యక్షేత్రమైన గంజ్ కు వెళ్లింది. 15రోజులపాటు ఆ ప్రదేశంలో ఉండటానికి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే ఆ అనుమతి గడువు మే 25న ముగిసిన తర్వాత తల్లి వెళ్లిపోయినా కూతురు మాత్రం వెళ్ళడానికి నిరాకరించింది.
పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే.. తాను సాక్షాత్తూ పార్వతీ దేవి అవతారం అని, కైలాస పర్వతం మీద ఉండే శివుడ్ని పెళ్లాడతానని, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లనని, బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులని బెదిరించింది. ఆత్మహత్య బెదిరింపులు చేయడంతో ఆమెని తరలించడానికి ఆలోచించారు పోలీసులు. అయితే ఆ మహిళ మానసిక స్థితి సరిగ్గా లేదని, అదనపు బలగాలని పంపించి ఆమెని తరలిస్తామని అక్కడి అధికారులు తెలిపారు.