భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త చరిత్రకు నాందిపలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. అసలు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి, ఆ పేరు ఎవరు పెట్టారు? భారతదేశపు మొదటి గిరిజన రాష్ట్రపతి పేరు ద్రౌపది. మహాభారతం పాత్ర పేరును అనుకోకుండా ఆమె స్కూల్ టీచర్ పెట్టారు. ఓడియా వీడియో మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ విషయాన్ని రాష్ట్రపతి వెల్లడించారు. […]