సుప్రిం కోర్టు నిబంధనల ప్రకారం నాలుగు వారాల ఎన్నికల కోడ్ అమలు చేయలేదంటూ పోలింగ్ పూర్తయిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ మళ్లీ నిర్వహించాలని ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల సంఘం డివిజనల్ బెంచ్‌కు లేదా సుప్రిం కోర్టుకు వెళ్లడం ఖాయం. అక్కడ వచ్చే తీర్పు ఆధారంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ మళ్లీ జరుగుతుందా..? లేదా..? అనేది తేలుతుంది. అప్పటి వరకు ఓ నిర్ణయానికి […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించినా.. రాష్ట్ర వ్యాప్తంగా 60.91 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలను మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. బ్యాలెట్ పేపర్లతో తప్పులు కారణంగా మూడు చోట్ల ఈ రోజు రీ పోలింగ్ జరుగుతోంది. ఏకగ్రీవాలు, అభ్యర్థులు మరణించిన చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు పెద్ద ఊరట లభించినట్లైంది. […]
మేం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటాం.. ఇక్కడే ఓట్లేస్తాం.. అడ్డుకోవడానికి మీరెవరు.. అంటూ కొటియా గ్రామాల గిరిజనులు ఒడిశా అధికారులపై తిరగబడ్డారు. వారిని ఎదిరించి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ ఘటన మరోసారి కొటియా వివాదాన్ని తెరపైకి తెచ్చింది. దశాబ్దాల వివాదం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కొటియా గ్రామాలపై ఆధిపత్యం విషయంలో దశాబ్దాలుగా వివాదం నలుగుతోంది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటై.. ఆంధ్ర, ఒడిశా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు విజయనగరం జిల్లా సాలూరు […]
మండల జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. పోలింగ్ బూత్‌లలో బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచీ 11 గంటల వరకు కూడా ఓటింగ్ ఒకే విధంగా జరుగుతోంది. మొదటి రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి 10 శాతం లోపు పోలింగ్ నమోదవగా.. తర్వాత […]
ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు విషయంలో డివిజన్ బెంచ్ భిన్నంగా స్పందించడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికల విషయంలో వాయిదా కు సింగిల్ బెంచ్ అంగీకరించగా, డివిజన్ బెంచ్ మాత్రం ఎస్ఈసీ వాదనను అంగీకరించింది. దాంతో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు ముగిసాయి. ఇక పరిషత్ ఎన్నికల ప్రక్రియ కూడా ముగించాల్సి ఉండగా ఈసారి దానికి భిన్నంగా సింగిల్ బెంచ్ స్పందన ఉండడంతో ఎస్ఈసీ మరోసారి హైకోర్టు డివిజన్ బెంచ్ […]
పరిషత్ ఎన్నికల ప్రచారం ముగిసి, మరో 36 గంటల తర్వాత పోలింగ్ జరుగుతుందనగా టీడీపీ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎన్నికలు ఆగిపోయాయి. ఎన్నికలకు 4 వారాల సమయం ఉండాలన్న సుప్రిం తీర్పును ఎన్నికల సంఘం పాటించలేదన్న టీడీపీ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. ఇది కొత్త నోటిఫికేషన్ కాదని, వాయిదా పడిన ప్రక్రియను తిరిగి ప్రారంభించామని, సుప్రిం తీర్పు వర్తించదన్న తమ వాదనను పరిగణలోకి తీసుకోని సింగిల్ జడ్జి తీర్పును.. ఎస్ఈసీ […]
ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి ప్రారంభమైన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు మళ్లీ బ్రేక్ పడింది. సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ విధించలేదని పేర్కొంటూ ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని పాటించలేదని, సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు వారాలపాటు కోడ్ అమలు […]
ఓటమి భయం వెన్నాడుతుంటే.. కుంటిసాకులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. పార్టీ సీనియర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా.. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అంతకంటే ఎక్కువగా మండిపడుతున్నారు. అధినేత నిర్ణయాన్ని ధిక్కరించి పోటీలో కొనసాగేందుకు తెగిస్తున్నారు. గ్రామాల్లో మనుగడ సాగించాలంటే, ఓట్ బ్యాంక్, వర్గాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని తెగేసి చెబుతున్నారు. ఎక్కడికక్కడ ధిక్కారస్వరం 40 ఏళ్ల పార్టీని, దాని జెండా […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. పిటిషనర్లు, ఎన్నికల కమిషన్.. ఇరువైపు వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఆగిన చోట నుంచే ఎన్నికలు జరగడం ఖాయమైన నేపథ్యంలో.. పరిషత్ ఎన్నికలు ఈ నెలాఖరులోపు జరుగుతాయా..? లేదా..? అనేదే ప్రస్తుతం ఆసక్తికర అంశం. గత ఏడాది మార్చిలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఘట్టం ముగిసింది. పరిషత్, మున్సిపల్ ఎన్నికలు మిగిలి ఉన్నాయి. గత ఏడాది మార్చిలో ప్రారంభమై వాయిదా పడిన పరిషత్, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఓ క్లారిటీ వచ్చింది. ఎన్నికలు ఎక్కడ ఆగాయో మళ్లీ అక్కడ నుంచే ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ, 3వ తేదీ సాయంత్రం తది జాబితా ప్రకటన, 10వ తేదీన […]