మండల, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించినా.. రాష్ట్ర వ్యాప్తంగా 60.91 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలను మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. బ్యాలెట్ పేపర్లతో తప్పులు కారణంగా మూడు చోట్ల ఈ రోజు రీ పోలింగ్ జరుగుతోంది. ఏకగ్రీవాలు, అభ్యర్థులు మరణించిన చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు పెద్ద ఊరట లభించినట్లైంది. […]